ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ప్రపంచం లోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మొదలయ్యింది. ఈ నెల 13 వ తారీఖు నుండి ఫిబ్రవరి 26 వరకూ ఈ కుంభమేళా జరగనుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా క్రతువుకు దేశం నాలు మూలాల నుండి సాధువుల రాక మొదలయ్యింది.

సాధువులన్నా సన్యాసులన్నా కూడా చాలా మంది లో ఒక రకమైన చులకన భావం ఉంటుంది. సంసార జీవితం పై విరక్తి తోనో లేక కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల తోనో పెద్దగా చదువు సంధ్యలు పెద్దగా వంట పట్టని వారు మాత్రమే సన్యాసం తీసుకుంటారు అనుకుంటారు అందరూ. కానీ అందులో కొంచెం కూడా నిజం లేదని, వివిధ అకాడాలకి చెందిన సన్యాసులు అంటున్నారు. వివిధ వృత్తుల వారు భౌతిక జీవితం లో దేశానికి ఎంత స్వవ చేయగలరో సన్యాసం తీసుకుంటే అంతకన్నా ఎక్కువగా సమాజానికి సేవ చేయగలరు అని అంటున్నారు.

ప్రయాగరాజ్ కు తరలి వస్తున్నా సన్యాసులు లో చాలా వరకూ వున్నత చదువులు చదివిన వారు వున్నారు. ఆధ్యాత్మిక జీవితం లోకి రాక ముందు వారి వారి వృత్తుల్లో సేవలందించిన వారూ వున్నారు. ఇందులో చాలా మంది డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, పండితులుగా పని చేసిన వారూ వున్నారు. వినటానికి కొంత ఆశ్చర్యం గా వున్నా ఇది నిజం. ఆ విషయాల్ని వారే మీడియా తో పంచుకున్నారు.

ఆధ్యాత్మిక జీవితం లోకి అడుగు పెట్టడం మరియు అందులో కొనసాగడం అంత సులువు కాదని వివిధ అఖాడాలకు చెందిన సాధువులు అంటున్నారు. సాధువులుగా మారాలంటే ఖచ్చితంగా సంప్రదాయాలకు కట్టుబడి ఉండడం తో పాటు, ప్రాపంచిక సంభందాలని త్యజించి ధైర్యం తెగువ కావాలని అంటున్నారు. అప్పుడే ఆధ్యాత్మిక జీవనం లో ఆనందంగా ఉండడమే కాకుండా అఖాడాలలో వివిధ వున్నత స్థానాలకు చేరుకోవచ్చు అంటున్నారు. వివిధ అఖాడాలలో సన్యాసం స్వీకరించిన వారు మిగతా వారికన్నా దేశానికీ, ప్రపంచానికీ సేవ చేయగలమని నమ్ముతారు. అనువల్లనే చాలా మంది విజయవంతమైన తమ తమ వృత్తుల్ని వదిలి సాధువులుగా మారారు. 12 ఏళ్ళకి ఒకసారి జరిగే ఆధ్యాత్మిక శోభని ప్రపంచానికి పరిచయం చేయాలి అని అంటున్నారు.

Thank you...