ఆర్ఆర్ఆర్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి, తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని చాలా చర్చలు జరిగాయి. చివరికి మహేష్ తో సినిమా చేస్తాడని అధికారికంగా ప్రకటనలు వచ్చాయి. దీనితో ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుంది అని అందరూ వేయి కళ్ళతో ఎదురు చూసారు. కానీ సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమం చేసేశారు. హైదరాబాద్ లోని అల్లుమినియం ఫ్యాక్టరీ లో ఈ కార్యక్రమం అత్యంత గోప్యం గా జరిగింది. లోపలి కార్లు వెళ్తున్న వీడియో లు తప్ప ఎటువంటి ఫోటో లు వీడియో లు బయటికి రాలేదు.

అయితే అదే రోజు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛంజెర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరు అయ్యాడు రాజమౌళి. కానీ సోషల్ మీడియా లో సినిమా గురించి చర్చ జరిగిందే తప్ప షోలో సుమ అడిగినా కూడా చెప్పకుండా, మనం బయట మాట్లాడుకుందాం అన్నాడు రాజమౌళి. ఎం చెప్పకుండానే స్పీచ్ ముగించాడు.

ప్రస్తుతానికి ఇండియా లో చాలా ఆత్రుతగా చూసే సినిమాలలో ఈ సినిమా ఒకటిగా వుంది. రాజమౌళి ఏమి చెప్పకపోవడం రాజమౌళి ప్రమోషన్ స్త్రతెగిఎస్ లో ఒక్కటిగా చెప్పుకుంటున్నారు అందరూ.

అయితే ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా లో ఉంటుంది అని.. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఈ సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప ఎవరికీ ఏమి తెలీదు అని అంటున్నారు సోషల్ మీడియా లో. అంతవరకూ అదేదో సినిమా లో రావు రమేష్ చెప్పినట్టూ పిసుక్కోవడమే తప్ప చేసేది ఏమి లేదు అని మహేష్ ఫాన్స్ అంటున్నారు.

Thank You