2025 లో Rs.20000 లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే..

1. సాఫ్ట్వేర్ పరంగా బెస్ట్ మొబైల్:

CMF Phone (1). ఇది 20 24 సంవత్సరానికి బెస్ట్ సాఫ్ట్వేర్ ఫోన్ అవార్డు గెలుచుకుంది. దీని గొప్పతనం అంతా దీని సాఫ్ట్వేర్ లోనే ఉంది. దీనిలో బ్లోట్ వేర్ కానీ యాడ్స్ కానీ ఉండవు. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ఫీచర్ ఉన్న ఫోన్ ఇది ఒక్కటే. నేను పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి లేదా తనకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇది చాలా మంచి ఫోన్. దీనిలో నథింగ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఉంది. ఇది మునిపెట్టి కన్నా చాలా మెరుగుపడింది వేగవంతంగా పనిచేస్తుంది. ఈమధ్యనే వీటిలో గ్యాలరీ యాప్ కూడా లాంచ్ చేశారు సొంతంగా. దీనిలో ఫోటో ఎడిటింగ్ దీని స్పెషాలిటీ బ్యాక్ గ్రౌండ్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎడిటింగ్ లో ఏఐ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. నథింగ్ ఓఎస్ 3.0 బీటా వెర్షన్ ఈ ఫోన్లో వచ్చేసింది. ఒక బడ్జెట్ ఫోన్లో ఇలా బీటా వెర్షన్ ఇవ్వడం ఇది మొదటిసారి కావచ్చు. ఇది బడ్జెట్ ఫోన్ అయినా గాని దీనిలో BGMI గేమ్ 120 FPS లో కూడా ఆడవచ్చు. ఇదే దీని ప్రత్యేకత. BGMI గేమ్ ఆడేటప్పుడు పెద్దగా హీట్ కూడా అవ్వట్లేదు. దీనిలో 5000 MAH బ్యాటరీ కూడా ఉంది. ఇది పూర్తిగా ఒకరోజు ఫోన్ వాడడానికి ఈజీగా సరిపోతుంది. దీనిలో 33 Watt ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఇది ఫోన్ చార్ చేయడానికి గంట వరకు సమయం తీసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ తో పాటు చార్జర్ మాత్రం ఇవ్వరు. మనం విడిగా కొనుక్కోవాల్సిందే. దీనిలో type c టు type c కేబుల్ ఇస్తారు. దీనిలో కెమెరా పనితనం సాధారణంగా ఉంటుంది. అద్భుతమైన ఫోటోలు తీయాలి అనుకుంటే ఈ ఫోన్ కొనకండి. కానీ ఈ బడ్జెట్లో ఈ ఫోన్ చాలా చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు.

మీరు కనుక వాల్యూ ఫర్ మనీ ఫోన్ చూస్తున్నారు అనుకుంటే ఇదే మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్.

ఈ ఫోన్ కొనాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి మీరు డిస్కౌంట్ లో కొనవచ్చు.

https://amzn.to/3BLZPEF

2. పెర్ఫార్మన్స్ మరియు గేమింగ్ పరంగా బెస్ట్ ఫోన్:

iQoo Z9s. దీనిలో 5500 బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది మరియు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. HDR 10 సర్టిఫికేషన్ ఉన్న చాలా తక్కువ ఫోన్లో ఇది ఒకటి. ఈ ఫోన్ గేమ్స్ ఆడటానికి చాలా బెస్ట్ ఫోన్. మీరు ఎక్కువ సేపు గేమ్ ఆడినా కూడా ఇది ఎక్కువగా వేడి ఎక్కదు. ఇది చాలా మంచి ఫీచర్. గేమింగ్ కే కాకుండా కెమెరా పరంగా కూడా ఇది చాలా మంచి ఫోన్. దీనిలో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ కెమెరా ఉంది. దీనిలో OIS సపోర్ట్ కూడా ఉంది. దీనిలో 1080P రిజల్యూషన్ లో పోర్ట్రైట్ వీడియోలు కూడా తీయవచ్చు. దీనిలో క్లీన్ ఓఎస్ ఉంటుంది. కొద్దిగా బ్లోట్ వేర్ ఉన్నప్పటికీ దానిని మనం రిమూవ్ చేయవచ్చు. దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేకపోవడం ఒక మైనస్ అని చెప్పవచ్చు. ఒక ఫోన్లో గేమ్ మరియు కెమెరా పనితనం రెండు బాగుండాలి అంటే అది IQoo Z9s.

ఈ ఫోన్ కొనాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి మీరు డిస్కౌంట్ లో కొనవచ్చు.

https://amzn.to/4gCtCi2

3. బెస్ట్ కెమెరా ఫోన్:

Motorola Edge 50 Neo. దీని ధర 24000 ఉన్నప్పటికీ ఇది ఆఫర్లతో కూడుకొని 20000 లోపల కొనవచ్చు. ఇది ఒక కాంపాక్ట్ బడ్జెట్ ఫోన్. ఇది చాలా పలచగా తేలికగా ఉంటుంది. దీనిలో 3X టెలిఫోటో కెమెరా ఉంది. దీని కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ఈకో సిస్టం చాలా బాగుంటుంది. దీనిని మన విండోస్ లాప్టాప్ తో అనుసంధానం చేయవచ్చు. దీనిలో ఐదు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎడ్జ్ 50 నియో ఆండ్రాయిడ్ 15 తో రన్ అవుతుంది. దీనిలో వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. ఈ బడ్జెట్లో వేరే ఏ ఫోన్ లోనూ ఈ ఫీచర్ అందుబాటులో లేదు. దీనిలో 68 వాట్ చార్జర్ ఫెసిలిటీ ఉంది. ఇది గేమింగ్ ఆడే వాళ్ళకి అంతగా సరిపడదు. ఇది వెనకాల వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుంది.

ఈ ఫోన్ కొనాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి మీరు డిస్కౌంట్ లో కొనవచ్చు.

https://amzn.to/4a6aXsq

Leave a Comment