– ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ తిరిగి రాసిన చరిత్ర
"ఒకప్పుడు హీరో… ఇప్పుడు లెజెండ్!"
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు OGలో ఆ స్థాయి రైజ్ ఇచ్చారు. థియేటర్లో లైట్ ఆఫ్ అవగానే, టైటిల్ కార్డు పడగానే – గుండె దడపట్టించే ఫీల్. డిజైన్ చూసేలోపే ఇది సాధారణ సినిమా కాదని క్లియర్. దర్శకుడు సుజీత్ గారు మొదటి నుండే మనకు చెప్పేశారు – ఇది కేవలం సినిమా కాదు, సినిమాటిక్ యూనివర్స్ స్టార్టింగ్ పాయింట్.
పవన్ కళ్యాణ్ – స్క్రీన్ మీద సునామీ
సినిమా ఫస్ట్ సీన్ నుండే పవన్ గారు ఎంటర్ అవగానే – బ్లాస్ట్! కొన్ని ఫ్రేమ్స్ లో ఆయనను చూపించిన విధానం? నిజంగా ఫ్యాన్ డైరెక్టర్ మాత్రమే ఇలాంటిది చూపగలడు. ఆ లుక్, ఆ స్టైల్, ఆ అటిట్యూడ్ – థియేటర్స్ కదలక తప్పదు.
"ఇదేనా మన పవన్ అన్న?" అని గర్వంగా ఫీలయ్యేలా ఉన్నాడు. ఫ్యాన్స్ కి ఇది లైఫ్ టైం మెమరీ.
తమన్ – బీజీఎమ్‌లో పిచ్చి కొట్టాడు
తమన్ అనగానే హై ఎనర్జీ బీట్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి? లైఫ్ అండ్ డెత్ లెవెల్లో పని చేశాడు.
ఒక్క బీట్ కూడా రిపీట్ కాదు.
ప్రతి సీన్ కి వేరే రిథమ్, వేరే టెంపో.
ఒకసారి విన్నామనే ఫీల్ ఎక్కడా రాదు.
ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన బీజీఎమ్? థియేటర్ మొత్తం ఒక్కసారిగా లిఫ్ట్ అయిపోతుంది. ఆహా ... literally గూస్బంప్స్!
కథ – డ్రామా, యాక్షన్, ఎమోషన్
OG ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా. యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ బలంగా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల డ్రామా ఎక్కువ కావడం వల్ల పేస్ కొంచెం డిప్ అయింది. ఎమోషన్ బలంగా వర్కౌట్ అయ్యుంటే – ఇంకా గట్టిగా తాకేదేమో.
అయినా సరే, స్క్రీన్‌ప్లే కంటిన్యూస్ గా టెన్షన్, డ్రామా, థ్రిల్లింగ్ మోడ్‌లోనే ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్? హిస్టారిక్. ఆ ఒక్క సీన్ చూసిన తర్వాత మిగతా సినిమా ఎంత గొప్పగా ఉన్నా – మన మైండ్‌లో తిరిగేది అదే షాట్.
సర్ప్రైజ్లు, రిఫరెన్సులు
-
Saaho యూనివర్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్.
-
పవన్ గారి Johnny సినిమా రిఫరెన్స్ – ఫ్యాన్స్ కి టోటల్ బ్లాస్ట్.
-
ఇంకా కొన్ని సీక్రెట్ కనెక్షన్స్ – థియేటర్ లో సర్ప్రైజ్ అవ్వాల్సిందే.
ఇదే ప్రూవ్ చేస్తుంది – OG ఒక సినిమా కాదు, ఒక సిరీస్ మొదలు. OG 2 హింట్ క్లియర్‌గా ఉంది.
పర్ఫార్మెన్సులు
పవన్ గారు తానే శ్వాస, తానే శక్తి. ఆయన ఒక లెవెల్ అయితే – ఇమ్రాన్ హష్మి, ప్రియాంక, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి – అందరూ ఇచ్చిన రోల్ మేరకు సాలిడ్‌గా చేశారు. కానీ నిజం చెప్పాలంటే – థియేటర్ మొత్తం పవన్ గారి ఇమేజ్ చుట్టూ తిరుగుతుంది.
డైరెక్షన్
సుజీత్ గారు ఒక పక్కా ఫ్యాన్ డైరెక్టర్. సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి, మాస్ + క్లాస్ కలిపి బిగ్ స్క్రీన్ మీద షో వేశారు. ఎక్కడో డ్రామా ఎక్కువయినా – మొత్తానికి ఆయన విజన్ 100% కన్వే చేశారు.
ఫైనల్ వెర్డిక్ట్
OG అంటే "Original Gangster" అనుకున్నారు. కానీ నాకు అనిపించింది –
O – Once in a while, G – Game-changing cinema!
ఈ సినిమా రొటీన్ కాదు. ఇది మాస్ కి ఫెస్టివల్, ఫ్యాన్స్ కి లైఫ్ టైం మెమరీ, తెలుగు సినిమాకి గ్యాంగ్‌స్టర్ జనరేషన్ స్టార్టింగ్ పాయింట్.
నా రేటింగ్: 4/5
ఇది సినిమా కాదు, ఒక సునామీ. థియేటర్ కి వెళ్లి అనుభవించాల్సిందే!

KC99 – simple and to the point. I wasn’t blown away, but it wasn’t bad either. Decent selection of games, nothing groundbreaking. If you want something reliable check out…