ఓజీ ట్రైలర్: ఓజాస్ గంభీర ఎంట్రీతో అలజడి!
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న మాస్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ “ఓజీ” ట్రైలర్ ఫైనల్లీ వచ్చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేయడంతో, ఫ్యాన్స్ ఉత్సాహం పీక్స్‌కు చేరింది.

దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం పవర్‌స్టార్ అభిమానులు రోజులు లెక్కపెడుతున్నారు.ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేని విధంగా “ఓజాస్ గంభీర” అనే డెడ్‌లీ గ్యాంగ్‌స్టర్‌గా ఎంట్రీ ఇచ్చి స్క్రీన్‌ని షేక్ చేశారు. పవర్‌ఫుల్ లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్, కత్తితో రౌడీలను ఊచకోత కోసే సీన్స్, గన్‌తో విలన్లను ధ్వంసం చేసే యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌లో రక్తం మరిగేలా చేశాయి.

పవన్ డైలాగ్ డెలివరీ, ఆథిట్యూడ్ – పూర్తిగా ఫ్యాన్స్ కోసం పుట్టిన విందు లాంటివి. సుజీత్ నిజమైన ఫ్యాన్ బాయ్‌గా, ఫ్యాన్స్ తమ హీరోని ఎలాగు చూడాలని కోరుకుంటారో అలా ప్రజెంట్ చేశాడనే చెప్పాలి.స్టైలిష్ విలన్‌గా ఇమ్రాన్ హష్మీ గట్టిగా ఆకట్టుకోగా, హీరోయిన్ ప్రియాంక మోహన్ హోమ్లీ లుక్‌తో అందంగా మెరిశారు. శుభలేఖ సుధాకర్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ లాంటి వారు కూడా ట్రైలర్‌లో కనిపించి సినిమాపై మరింత ఆసక్తి రేపారు.

విజువల్స్ క్లాస్, యాక్షన్ మాస్ – ఈ రెండింటినీ బలంగా మిక్స్ చేసిన సీన్స్‌కు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అలరింపక మానదు.

హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో థమన్ బీజీఎమ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది.సినిమా వర్క్ పూర్తి కాకపోయినా, ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా కట్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే యూట్యూబ్‌లో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం మేకర్స్ ఇంకా మిస్టరీగానే ఉంచారు.

పవర్‌స్టార్ ఓజాస్ గంభీర అవతారంలో అదరగొట్టాడంటే అది ఓజీ ట్రైలర్ చూసిన తర్వాతే తెలుస్తుంది!