ఇతను మన భారతీయులకు దేవుడితో సమానం

ఇతను మన భారతీయులకు దేవుడితో సమానం.భారతీయులందరూ తప్పకుండా చదివి తెలుసుకోవాలి.కుదిరితే షేర్ చేసి అందరికీ తెలియజేయండి.ఇతడి పేరు వ్లాదిమిర్ క్రుగ్లయాకోవ్ (Vladimir Kruglyakov),మాజీ USSR 10th Battle Group కమాండర్.1971 భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి తప్పని పరిస్థితుల్లో, అరబ్ లాబీ వారితో దగ్గరి సంబంధాలున్న అమెరికా రక్షణ మంత్రి కిసింజర్ కాళ్లు పట్టుకున్నాయి. కిసింజర్ రంగంలోకి దిగి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ను పాకిస్తానుకు మద్దతుగా భారతదేశంపై దాడి చేయమని ఒప్పించాడు.ఈ దశలో కిసింజర్ మాట్లాడుతూ భారత్‌ను తీవ్ర స్థాయిలో దూషించాడు కూడా. అంతేకాకుండా ఈ యుద్ధంలో బ్రిటన్ కూడా భారత్‌పై దాడి చేయడానికి బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒప్పించాడు. ఇక్కడితో ఆగకుండా చైనా మద్దతును కూడా తీసుకోవడానికి హుటాహుటిన చైనా పర్యటన చేసి చైనాను కూడా ఒప్పించాడు.వెంటనే అమెరికా, బ్రిటన్ నేవీలు భారత్‌పై దాడి చేయడానికి రంగంలోకి దిగాయి.అమెరికా నుంచి అప్పట్లో అతిపెద్ద విమాన వాహక నౌక USS Enterprise (Nuclear) ను, బ్రిటన్ తన Eagle అనే విమాన వాహక నౌకను భారత నౌకాశ్రయాలు, యుద్ధ నౌకలపై దాడి చేయడానికి రంగంలోకి దింపాయి.చైనా కూడా తన నౌకాదళాన్ని భారత్‌పై దాడి చేయడానికి సిద్ధం చేసింది.ఈ విషయం తెలుసుకున్న రష్యా వెంటనే ఈ సమాచారాన్ని భారత్‌కు అందించింది. ఈ పరిస్థితులనుండి గట్టెకించుకోవాలని భారత్ రష్యాను కోరడంతో వెంటనే రష్యా మన సూపర్ స్టార్ వ్లాదిమిర్ క్రుగ్లయాకోవ్ ను రంగంలోకి దింపింది.వెంటనే వ్లాదిమిర్ క్రుగ్లయాకోవ్ ముందుగా చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు:“మీరు ఏ పరిస్థితుల్లో అయినా భారత్‌పై దాడి చేస్తే వెంటనే మా నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది. ఇందులో సందేహం లేదు. ఈ విషయంపై ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదు” అని హెచ్చరించడంతో చైనా భారత్‌పై దాడి చేయాలనే ఆలోచనను విరమించుకుంది.ఇక ఈ కమాండర్ వెంటనే వ్లాడివోస్టోక్ నుంచి రెండు యుద్ధ నౌకలను, రెండు అణు జలాంతర్గాములను తీసుకుని స్వయంగా రంగంలోకి దిగాడు.ఇతను తెలివిగా Enterprise వెంటే ఒక యుద్ధ నౌక, ఒక జలాంతర్గామి — అలాగే బ్రిటిష్ Eagle వెనుక ఒక యుద్ధ నౌక, ఒక జలాంతర్గామితో కేవలం 500 మీటర్ల దూరం నుంచే వెంబడించడం ప్రారంభించాడు. అంతేకాకుండా అమెరికా, బ్రిటన్ నేవీలకు “మీరు భారత్‌పై ఒక్క మిసైల్ కూడా ప్రయోగించిన వెంటనే మేము మీమీద దాడి చేస్తాం” అని హెచ్చరిస్తూ వాటిని వెంబడించాడు.అమెరికా, బ్రిటన్ నౌకలు అతన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా, ఇతను పట్టు వదలని విక్రమార్కుడిలా దాదాపు 26 రోజులు వాటిని వెంబడిస్తూ భారతదేశంపై ఈగ కూడా వాలకుండా కాపాడాడు.ఇంతలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోయి తన ఓటమిని అంగీకరించడంతో చేసేదేమీ లేక అమెరికా, బ్రిటన్ దేశాలు తమ నౌకలను వెనక్కు పిలిచాయి. అవి వెళ్ళిపోవడంతో కూడా మరలా తిరిగి వస్తాయేమోనని ఇంకో 20 రోజులు బంగాళాఖాతంలోనే తిష్ట వేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడాడు.ఇతనికి మన దేశం ఎప్పటికీ ఋణపడి ఉండాలి… ఉంటుంది కూడా.

Leave a Comment